News May 11, 2024

పెనగలూరు: ప్రమాదవశాత్తూ బాలుడి మృతి

image

ఈట మాపురంలో ప్రమాదవశాత్తు కింద పడి ఓ బాలుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాలు మేరకు.. మహేశ్వర్ రాజు, అశ్వనిల మొదటి కుమారుడు కుశాల్ కుమార్ రాజు (7) తాత వద్ద ఉన్న సెల్ ఫోన్ చూస్తూ వెనుకకు జరుగుతూ అరుగుపై నుంచి కిందపడ్డాడు. తల వెనుక భాగం ముందుగా నేలను తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గల్ఫ్ లో ఉన్న మహేశ్వర్ రాజు విషయం తెలియగానే ఇంటికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించాడు.

Similar News

News January 21, 2026

రికార్డు సృష్టించిన కడప

image

ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీలో కడప జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. కార్గో మాసోత్సవాల్లో భాగంగా 10,961 టార్గెట్ కాగా ఏకంగా 17,937 డెలివరీలు పూర్తి చేశారు. మంగళవారం 4వ విడత లక్కీ డిప్ విజేతలకు ‘కోతాస్ ప్రొడక్ట్స్’ ఛైర్మన్ అభిరామ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని డీపీటీవో గోపాల్ రెడ్డి కోరారు. పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

News January 20, 2026

రామచంద్రమూర్తికి జీవన సాఫల్య పురస్కారం: YVU వీసీ

image

ప్రముఖ జర్నలిస్టు, సంపాదకులు కె.రామచంద్రమూర్తికి గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారం-2025 ఇవ్వనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయ వి.సి ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించిన జర్నలిస్టులకు ప్రతి ఏటా ఒకరికి అవార్డును అందజేస్తున్నారు. 2025కు ఈయన్ను ఎంపిక చేశామన్నారు.

News January 20, 2026

లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఎప్పుడంటే..?

image

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనుంది. దీనికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతర నిర్వాహకులకు మంగళవారం సూచించారు. గ్రామంలో జరిగిన గంగమ్మ పార్వేట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.