News April 3, 2025
పెనమలూరులో వ్యాపారి కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం హైడ్రామ చోటుచేసుకుంది. పోరంకి నారాయణపురం కాలనికి చెందిన వెంకటేశ్వరరావును, వ్యాపార విభేదాల నేపథ్యంలో భాగస్వామి రాజు తన అనుచరులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన ఆయన కుమార్తె పోలీసులకు సమాచారం అందించడంతో, వారు అప్రమత్తమై వెంటనే అతడిని కాపాడి కిడ్నాప్‌కు ముగింపు పలికారు.
Similar News
News April 11, 2025
కృష్ణా: రేపే ఇంటర్ ఫలితాలు.. ఉత్కంఠ

ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్కంఠతో ఉన్నారు. తొలిసారి ఇంటర్ పరీక్షలు రాసిన ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కంటే ఎక్కువగా, భవిష్యత్ లక్ష్యాలపై ఆశలు పెట్టుకున్న సెకండ్ ఇయర్ విద్యార్థుల్లో ఉద్విగ్నత కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో 1వ సంవత్సరం 24,557, 2వ సంవత్సరం 20,873 మంది మొత్తం 45వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.
News April 11, 2025
మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు

మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేయగా రాజబాబుపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను విధుల నుంచి తప్పించారు.
News April 11, 2025
తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు.!

తిరుపతి-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13వ తేదీ నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి మచిలీపట్నం, మే 14 నుంచి 26 వరకు ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి తిరుపతికి స్పెషల్ రైలు నడవనుంది. ఈ రైలులో 2AC, 3AC, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రయాణికులు ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సూచించింది.