News June 22, 2024
పెనమలూరు: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. వ్యక్తిపై కేసు నమోదు

రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నగదు వసూలు చేసిన వ్యక్తిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాలు మేరకు పెనమలూరుకు చెందిన మహిధర్ అనే వ్యక్తి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుడు అనిల్ కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.15లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు.
Similar News
News November 24, 2025
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో వచ్చే అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. తొలుత అధికారులతో సమావేశమై ఇప్పటి వరకు వచ్చిన అర్జీల పరిష్కార చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న అర్జీలను తక్షణం పరిష్కరించాలన్నారు.
News November 24, 2025
నేడు ఘంటసాలలో పర్యటించనున్న మంత్రి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు నేడు కృష్ణాజిల్లా ఘంటసాలలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఘంటసాలలోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్తో కలిసి పాల్గొననున్నారు. అనంతరం రోడ్డుమార్గాన బయలుదేరి విజయవాడ గవర్నర్ పేటలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్కు వెళ్లనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.