News January 30, 2025

పెనమలూరు: ఒడిశా నుంచి గంజాయి సరఫరా

image

గంజాయి అమ్ముతున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. మణికంఠ, పూజిత భార్యాభర్తలు ఒడిశా నుంచి గంజాయిని కానూరులోకి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి అమ్ముతున్నారు. మంగళవారం రాత్రి కామయ్యతోపు వద్ద వాహనాలు తనిఖీలో పోలీసులకు దొరికారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.

Similar News

News February 13, 2025

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: కలెక్టర్

image

ఈ నెల 27న MLC ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులుగా నియమితులైన వారు బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. బుధవారం జడ్పీ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులకు ఒక రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హ్యాండ్‌బుక్‌ను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.

News February 12, 2025

కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికలకు 77 పోలింగ్ కేంద్రాలు

image

కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఫిబ్రవరి 27న నిర్వహించే పోలింగ్‌కు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు జిల్లా పరిషత్ కన్వెన్షన్ సెంటర్‌లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీ.కే. బాలాజీ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో Polling staff కీలక పాత్ర వహించాలన్నారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News February 12, 2025

కృష్ణా: RTC బస్సులో తండేల్ సినిమా.. కొనకళ్ల స్పందన

image

ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణ స్పందించారు. 9వ తేదీన పలాస నుంచి విజయవాడ వస్తున్న బస్సులో సినిమా ప్రదర్శించినట్లు కంప్లైంట్ వచ్చిందని ఆయన చెప్పారు. అలా ప్రదర్శించడం అనేది తప్పని ఆయన ఖండించారు. దీనిపై ఎంక్వయిరీ జరుగుతుందని తెలిపారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

error: Content is protected !!