News June 14, 2024
పెనుకొండ ఎమ్మెల్యేకు అప్పుడు.. ఇప్పుడు ఒకే శాఖ
పెనుకొండ ఎమ్మెల్యేకు మరోసారి బీసీ సంక్షేమశాఖ దక్కింది. వైసీపీ ప్రభుత్వంలో పెనుకొండ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన శంకరనారాయణ ఈ శాఖతో పాటు రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా పనిచేయగా.. ఈసారి కూడా తొలిసారి గెలుపొందిన సవితకు ఇదే బీసీ సంక్షేమశాఖ దక్కడం గమనార్హం. కాగా వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు <<13439231>>మంత్రులు<<>> ఉండగా ఈసారి ముగ్గురు ఉండటం విశేషం.
Similar News
News September 12, 2024
‘ఉరవకొండ’ పేరు వెనుక ఇదీ చరిత్ర!
ఉరవకొండ పేరు వినగానే కొండ గుర్తుకొస్తుంది. పట్టణంలోని ఈ కొండకు ఘన చరిత్రే ఉంది. పాముపడగ ఆకారంలో కొండ ఉండటంతో పూర్వం ఈ పట్టణాన్ని ఉరగాద్రి అని పిలిచే వారట. సంస్కృతంలో ఉరగ అంటే పాము పడగ, అద్రి అంటే కొండ అని అర్థం. కాలక్రమేణా ఉరవకొండగా మారింది. చిక్కన్న అనే పాలేగాడు ఇక్కడ కోట బురుజు నిర్మించుకుని, కొంతకాలం సామంత పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ పట్టణం కొండ చుట్టూ అభివృద్ధి చెందుతుండటం విశేషం.
News September 12, 2024
బీటెక్, MBA, MCA, M.SC ఫలితాల విడుదల
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని బీటెక్ సప్లిమెంటరీ (R15, R19), MBA (R17, R21), MCA (R20, R21), M.SC (R20, R21) ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News September 12, 2024
విజయవాడ వరద బాధితుల కష్టాలకు చంద్రబాబే కారణం: కేతిరెడ్డి
విజయవాడలో వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడడానికి కారణం సీఎం చంద్రబాబే అని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. బుడమేరు కాలువకు అధిక మొత్తంలో వరద రాబోతోందని అధికారులు తెలిపినా పట్టించుకోలేదని అన్నారు. అందుకే వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు మునిగాయన్నారు.