News July 4, 2024
పెనుకొండ: ఒకే కాన్పులో ముగ్గురు జననం.. తల్లి మృతి
పెనుకొండ మండలం మోటువారిపల్లికి చెందిన వెన్నెల(25) ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చి.. మృతి చెందారు. వెన్నెల జూన్ 29న ఒకే కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పిల్లలు క్షేమంగా ఉన్నారు. అయితే వెన్నెల బిడ్డలకు జన్మనిచ్చి కోమాలోకి వెళ్లిపోయింది. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Similar News
News October 4, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.77
అనంతపురం రూరల్ కక్కలపల్లి మార్కెట్‌లో కిలో టమాటా గరిష్ఠంగా రూ.77తో అమ్ముడుపోయినట్లు రాప్తాడు మార్కెట్ యార్డు కార్యదర్శి రాంప్రసాద్ తెలిపారు. మార్కెట్‌కు మంగళవారం మొత్తంగా 630 టన్నుల టమాటా దిగుబడులు వచ్చాయని తెలిపారు. కిలో సరాసరి రూ.67, కనిష్ఠ ధర రూ.51 పలికినట్లు తెలిపారు. టమాటా ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది.
News October 4, 2024
ATP: 2,79,161 మందికి రూ.55.83 కోట్లు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 18వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు నిధులు విడదల చేయనుంది. ఒక్కో రైతు ఖాతాలో రూ.2 వేలు చొప్పున జమకానుంది. అనంతపురం జిల్లాలో 2,79,161 మందికి రూ.55.83 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.
News October 4, 2024
బెనిఫిట్స్ త్వరగా వచ్చే విధంగా చూడండి: ఎస్పీ
పోలీస్ శాఖలో పనిచేస్తూ చనిపోయిన, పదవి విరమణ పొందిన వారికి రావలసిన బెనిఫిట్స్ త్వరగా అందేలా చూడాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న సూచించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో డిపిఓ సిబ్బంది, అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పదవి విరమణ పొందిన వారికి, మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో వాటి వివరాలు తెలపాలని పేర్కొన్నారు.