News January 17, 2025

పెనుకొండ కియా నుంచి కొత్త కారు

image

పెనుకొండ కియా కంపెనీ నుంచి కియా సిరోస్ (Kia Syros) కారు ఉత్పత్తి ప్రారంభమైంది. ఢిల్లీలో నేటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్న ఆటో ఎక్స్‌పో-2025లో ఈ కారును ప్రదర్శించనున్నారు. అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 1న కారు ధర నిర్ణయిస్తామని సీఈవో హొసంగ్‌ తెలిపారు. ఇప్పటికే 10,258 మంది బుక్‌ చేసుకున్నారని చెప్పారు. ఫిబ్రవరిలో ఈ కారు డెలివరీలు ప్రారంభమవుతాయని వివరించారు.

Similar News

News February 8, 2025

మరుట్లలో 400 చీనీ చెట్లకు నిప్పు

image

కూడేరు మండలంలోని మరుట్ల రెండో కాలనీ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు చిన్నకొండప్ప గారి శ్రీనివాస్ నాయుడు తోటలో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 400 చీనీ చెట్లు దగ్ధమయ్యాయి. డ్రిప్ పరికరాలు, పైప్లైన్ గేట్ వాల్స్ మొత్తం కాలి బూడిద అయ్యాయి. దాదాపుగా రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధిత రైతు తెలిపాడు.

News February 8, 2025

శైలజానాథ్‌కు కీలక పదవి ఇస్తారా?

image

పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరడంతో ఆ పార్టీ జిల్లా శ్రేణుల్లో జోష్ నెలకొంది. ఎన్నికలకు మరో 4ఏళ్ల సమయం ఉండగా, కష్ట కాలంలో YCP తీర్థం పుచ్చుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా పార్టీకి ఆయన అదనపు బలం అని భావిస్తున్నాయి. మరోవైపు శైలజానాథ్‌కు జగన్ కీలక పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

News February 8, 2025

కొడుకు ముందే ప్రాణాలు విడిచిన తల్లి

image

నార్పలకు చెందిన గంగమ్మ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఆమె తన కొడుకు మంజునాథ్‌తో కలిసి నార్పల నుంచి హిందూపురానికి బైక్‌లో వెళ్తున్నారు. దారి మధ్యలో CK పల్లి మండలం NS గేటు సమీపంలో బైక్ గుంతలోకి దిగడంతో ఆమె ఎగిరి కింద పడ్డారు. గంగమ్మ తలకు తీవ్రగాయమై మృతి చెందింది. ఘటనకు ర్యాష్ డ్రైవింగే కారణమని స్థానికులు తెలిపారు. మృతిరాలి భర్త ఈశ్వరయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. 

error: Content is protected !!