News August 3, 2024
పెనుకొండ వద్ద 15 మంది అరెస్ట్
పెనుకొండ వద్ద పేకాట స్థావరంపై దాడి చేసి 15 మందిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాజీ ఖాన్ సైదా తెలిపారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, రూ.17.10 లక్షల నగదు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బెంగళూరు, కడప, కర్నూల్ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం వచ్చిందని డీఎస్పీ తెలిపారు. దాడి చేసి శెట్టిపల్లి ప్రాంతంలో 15 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
Similar News
News September 8, 2024
సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న భారత మాజీ క్రికెటర్లు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయిబాబా మహాసమాధిని భారత మాజీ క్రికెటర్లు దర్శించుకున్నారు. ఆదివారం భారత మాజీ క్రికెటర్లు చేతన్ శర్మ, అజయ్ మల్హోత్రా, ప్రస్తుత బీసీసీఐ మేనేజర్ అమిత్ సిద్దేశ్వర్, మాజీ ముంబై ఇండియన్స్ ప్లేయర్ షాబుద్దీన్, తదితరులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ టోర్నమెంట్‌కు విచ్చేసిన క్రీడాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
News September 8, 2024
అనంత: తవ్వకాల్లో బయటపడ్డ అయ్యప్ప స్వామి విగ్రహం
బెళుగుప్ప మండలంలోని దుద్దెకుంటలో ఆలయం నిర్మాణం కోసం తీసిన తవ్వకాలలో గ్రామానికి చెందిన క్రాంతి అనే యువకుడికి అయ్పప్ప స్వామి విగ్రహం దొరికింది. క్రాంతి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి తనకు కలలో ఈ విగ్రహం గురించి చెప్పినట్టు తెలిపారన్నాడు. విగ్రహం 500 గ్రాముల బరువు ఉన్నట్లు చెప్పాడు. స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు.
News September 8, 2024
అనంతపురంలో యువతి దారుణ హత్య UPDATE
ఆత్మకూరు మండలం వడ్డుపల్లి వద్ద హత్యకు గురైన గుమ్మగట్ట మండలం సిరిగే దొడ్డి గ్రామానికి చెందిన మహిళ శిరీషగా పోలీసులు గుర్తించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదువుతోందని, శనివారం ఇంట్లో చెప్పి వచ్చినట్లు శిరీష కుటుంబ సభ్యులు తెలిపారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.