News March 19, 2025
పెనుగంచిప్రోలు ఘటనలో 9 మందిపై కేసు నమోదు

పెనుగంచిప్రోలులో మంగళవారం జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించి 9 మందిపై కేసు నమోదు చేసినట్లు జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ఏసోబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వరరావు, గోపి, మణికంఠ, నాగబాబు, సుదీర్, వేల్పుల అజయ్, యాదగిరి, శ్రీహరి, వెంకటేశ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Similar News
News December 1, 2025
ఇంతకన్నా శుభకరమైన రోజు ఉంటుందా?

శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి నేడు చాలా అనుకూలమైన, శుభకరమైన రోజని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది శివకేశవులకు ఎంతో ఇష్టమైన మార్గశిర మాసం. అందులోనూ నేడు పరమ శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం, విష్ణు పూజలకు పవిత్రంగా భావించే సర్వ ఏకాదశి కలిసి వచ్చాయి. ఈ కలయికకు తోడుగా ఈరోజే గీతా ఆవిర్భవించింది. అందుకే ఈ రోజున ధర్మకార్యాలు చేస్తే ఆ పుణ్యఫలం జన్మజన్మల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.
News December 1, 2025
NRPT: 15 మంది సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా ఆదివారం మొత్తం 15 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కోటకొండలో ఇద్దరు, బొమ్మన్పాడులో ముగ్గురు, శాసన్పల్లి సర్పంచ్ స్థానానికి నలుగురు నామినేషన్లు వేశారు. మిగిలిన అప్పక్పల్లి, అంతర్, జాజాపూర్, షేర్నపల్లి, సింగారం, తిరుమలాపూర్ పంచాయతీలకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు వేశారు.
News December 1, 2025
కర్నూలు జిల్లా రైతులకు దిత్వా భయం

కర్నూలు జిల్లా రైతులను దిత్వా తుఫాను భయపెడుతోంది. చేతికొచ్చిన వరి పంట నేలకొరిగితే తీవ్రంగా నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీగా పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చేస్తున్నారు. ఒక్క పెద్దకడబూరు మండల పరిధిలోనే సుమారు 3వేల ఎకరాల్లో వరి సాగైనట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం తుఫాను ప్రభావం కారణంగా కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.


