News March 25, 2025
పెనుగంచిప్రోలు: పురుగుమందు తాగి వ్యక్తి మృతి

పెనుగంచిప్రోలుకు చెందిన వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని దేవరుప్పుల మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సృజన్ కుమార్ కథనం మేరకు.. బత్తుల గోపి సీతారాంపురం గ్రామంలోని ఇటుక బట్టీలో పని చేయడానికొచ్చాడు. కాగా మద్యం తాగడం కోసం తన భార్యను రూ.200 అడగగా ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య గొడవ జరగగా.. గోపి మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు.
Similar News
News September 17, 2025
ప్రధాని మోదీ రాజకీయ ప్రస్థానం

*మోదీ గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950లో జన్మించారు.
*8 ఏళ్ల వయసులో RSSలో చేరి.. 15 ఏళ్లు వివిధ బాధ్యతలు చేపట్టారు.
*1987లో BJP గుజరాత్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.
*2001లో శంకర్‌సింగ్ వాఘేలా, కేశూభాయ్ పటేల్ మధ్య వివాదాలు ముదరడంతో మోదీని CM పదవి వరించింది.
*పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి 2014, 2019, 2024లో దేశ ప్రధానిగా హ్యాట్రిక్ నమోదు చేశారు.
News September 17, 2025
కావలిలో SI ఇంటి ముందు మహిళ ఆందోళన

కావలిలోని ముసునూరులో SI వెంకట్రావు ఇంటిముందు మంగళవారం రాత్రి ఓ మహిళ ఆందోళనకు దిగింది. గతంలో ఎస్ఐ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు ఎస్ఐ వెంకట్రావుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నగదు ఇచ్చేలా ఇటీవల ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. మధ్యవర్తులు తనకు నగదు ఇవ్వలేదని ఆమె నిన్న రాత్రి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆందోళన చేసింది.
News September 17, 2025
బుమ్రాకు రెస్ట్?

ఆసియా కప్‌లో ఇప్పటికే సూపర్-4కు చేరిన భారత్ గ్రూప్ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్ ఎల్లుండి ఒమన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. UAE, పాక్‌తో జరిగిన 2 మ్యాచుల్లోనూ బుమ్రా మంచి రిథమ్‌తో కన్పించారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్ అయిన ఆయన గాయాల బారిన పడకుండా ఉండాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ లేదా హర్షిత్ ఆడే ఛాన్స్ ఉంది.