News June 11, 2024

పెనుగొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ప.గో జిల్లా పెనుగొండ మండలం దొంగరావిపాలెం జాతీయ రహదారిపై యాక్సిడెంట్ జరిగింది. పోడూరు మండలం జిన్నూరుకు చెందిన వెంకటపతి(75) కత్తి పీటల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం వ్యాపారం నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా.. పెరవలి నుంచి రావుపాలెం వెళ్తున్న కారు ఢీ కొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో అంబులెన్స్‌లో తణుకు ఆసుపత్రికి తరలించగా వెంకటపతి అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 7, 2026

శాఖాపరమైన పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు: డీఆర్ఓ

image

భీమవరం డీఎన్ఆర్ స్వయంప్రతిపత్తి కళాశాలలో ఈనెల 8న జరగనున్న ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన అర్హత పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.శివన్నారాయణ రెడ్డి ఆదేశించారు. ఈ పరీక్షకు సుమారు 100 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ఏర్పాటు చేయాలన్నారు.

News January 7, 2026

ఏలూరు: నిర్లక్ష్యం ఖరీదు.. రూ.900 కోట్లు!

image

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్‌ నిర్మాణ సమయంలో 2019 నాటికి ఇరువైపులా ఖాళీలు వదిలేశారు. ఖాళీల గుండా 2020లో వచ్చిన వరదకి డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతింది. దీనిపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం ఖజానాకు భారీగా చిల్లులు పెట్టింది. దెబ్బతిన్న వాల్‌ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు రూ.900 కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News January 7, 2026

ప.గో జిల్లా జేసీ హెచ్చరిక

image

యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవని జేసీ రాహుల్ హెచ్చరించారు. డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులకు ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 83310 56742‌కు తెలియజేయాలన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రిటైల్ డీలర్లతో సమీక్షించారు.