News November 14, 2024
పెనుగొండ: ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు కుటుంబానికి జైలు శిక్ష
పెనుగొండకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ మహేంద్రకుమార్, అతని కుటుంబానికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. మహేంద్రకుమార్ భార్య చైతన్యను అదనపు కట్నం కోసం హింసిస్తూ ఉంటే అతని తల్లి, తండ్రి సహకరించేవారు. దీంతో 2020లో బాధితురాలు ఆచంట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టు బుధవారం నిందితులకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షలు జరిమానా విధించి, ఆసొమ్మును చైతన్యకు ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.
Similar News
News December 6, 2024
ప.గో: 111 మంది ఉద్యోగుల తొలగింపు
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 111 మంది కాంట్రాక్టు ఎంపీహెచ్ఏ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ డీఎంహెచ్‌వో శర్మిష్ట గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్హతలున్నప్పటికీ మెరిట్ లేకుండా పొందిన ఉద్యోగ నియామకాలు చెల్లవంటూ హైకోర్టు తీర్పు నిచ్చింది. జీవో 1207ని కొట్టి వేస్తూ ఉద్యోగాలు పొందిన వారు మెరిట్‌ప్రకారం రిక్రూట్ అయిన వారిని కొనసాగించాలని నవంబరు 29న తుదితీర్పులో కోర్టు ఆదేశించింది.
News December 6, 2024
ప.గో: ఇస్త్రీ పెట్టె దొంగలించారు..!
పెనుమంట్ర మండలం మార్టేరులో రెడ్డి కళ్యాణమండపం ఎదురుగా ఉన్న పుల్లల షాపులో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. దొంగలు 10 కేజీ, 5 కేజీల తూకం రాళ్లు, ఇస్త్రీ పెట్టి దొంగలించారు. పెనుమంట్ర మండలంలో గత కొంతకాలంగా దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రధానంగా మార్టేరులో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
News December 5, 2024
ఏలూరు జిల్లాలో 2,443 మంది ఓటు వేశారు: కలెక్టర్
ఏలూరు జిల్లాలో గురువారం జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,667ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో 2,443 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని స్పష్టం చేశారు. ఓట్లు వేసిన వారిలో స్త్రీలు 1,056, పురుషులు 1,387 మంది ఓటు వేశారన్నారు.