News January 7, 2025
పెనుగొలనులో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి
గంపలగూడెం మండలంలోని పెనుగొలనులో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి బంధం నాగమణి అనే నిర్వాహకురాలిని అరెస్ట్ చేసినట్లు తిరువూరు సీఐ కె.గిరిబాబు తెలిపారు. నిందితురాలిని తిరువూరు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ నిమిత్తం నూజివీడు సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సీఐ హెచ్చరించారు.
Similar News
News January 9, 2025
కృష్ణా: రేపటి నుంచి సెలవులు
కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులకు శుక్రవారం నుంచి సెలవులు రానున్నాయి. పీజీ విద్యార్థుల పరీక్షలు గురువారం ముగియడంతో విద్యార్థులు సెలవుల మూడ్లోకి వెళ్లనున్నారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో ఆ రెండు రోజులు యూనివర్సిటీకి శెలవు ప్రకటించారు. సోమవారం నుంచి శనివారం వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చినట్లు వర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ నెల 20 నుంచి కృష్ణా వర్సిటీ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.
News January 9, 2025
NTR: తల్లిని హత్య చేసిన కూతురు
ఇబ్రహీంపట్నంలో ఈనెల 7న ఎస్తేరు (పాస్టర్) అనే మహిళ హత్యకు గురైన విషయం తెలిసిందే. కొండపల్లికి చెందిన ఎస్తేరుకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె జీవమణికి గతంలో పెళ్లి కాగా, భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఈక్రమంలో షేక్ నాగూర్ వలీతో జీవమణికి అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో తల్లి మందలించడంతో కక్ష పెంచుకొని హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసినట్లు ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు.
News January 9, 2025
రీసర్వేలో కచ్చితత్వానికి ప్రాధాన్యమివ్వాలి: కలెక్టర్
రీసర్వేలో కచ్చితత్వానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేపై వర్క్షాప్ నిర్వహించారు.