News March 1, 2025
పెనుబల్లి: చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం కలకలంరేపింది. మద్యం మత్తులో ఉన్న దుంప వెంకటేశ్వరరావు చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీ.ఎం.బంజర్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 13, 2025
అభివృద్ధి ఓ వైపు.. ఉద్యమం మరో వైపు..!

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతరకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. జాతర నిర్వహణకు ప్రభుత్వం రూ.150 కోట్లను కేటాయించగా వందరోజుల యాక్షన్ ప్లాన్‌తో పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పంటనష్ట పరిహారం వివాదం తెరపైకి వచ్చింది. జాతర సమయంలో పంట నష్ట పోతున్న రైతులకు ఎకరాకు రూ.50వేలు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ రైతాంగ పోరాటాన్ని BRS వెనకుండి నడిపిస్తున్నట్లు సమాచారం.
News September 13, 2025
నిరుద్యోగులను మోసం చేసిన సీఎం: హరీశ్‌రావు

TG: గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని BRS నేత హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘జాబ్స్ కోసం మంత్రులు, అధికారులు లంచం అడిగారని నిరుద్యోగులు చెబుతున్నారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి అప్పీల్‌కి వెళ్లాలనుకోవడం సిగ్గుచేటు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్, ప్రియాంకతో చెప్పించి రేవంత్ మోసం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేశారు.
News September 13, 2025
‘సిగాచీ’పై నివేదిక రెడీ.. ఇక సర్కారు నిర్ణయమే తరువాయి

పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది మరణించిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విచారణను పూర్తి చేసింది. ఈ మేరకు కమిటీ సభ్యులు కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ కు విచారణ నివేదికను అందజేశారు. ప్రమాదానికి కారణాలతోపాటు ఇటువంటి ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సభ్యులు కూలంకుషంగా నివేదికలో పొందుపరిచారు.