News March 1, 2025
పెనుబల్లి: చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం కలకలంరేపింది. మద్యం మత్తులో ఉన్న దుంప వెంకటేశ్వరరావు చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీ.ఎం.బంజర్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 17, 2025
బాపట్ల జిల్లా వ్యాప్తంగా 234 మంది విద్యార్థులు గైర్హాజరు

పదవ తరగతి పరీక్షలు బాపట్ల జిల్లాలో మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగాయని అధికారులు వెల్లడించారు. మొత్తం 103 పరీక్షా కేంద్రాలలో మొత్తం 16481 మంది విద్యార్థులకు గాను 16247 మంది విద్యార్థులు హాజరయ్యారు. 234 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లా పర్యవేక్షణ అధికారిణి మతి గంగాభవాని తెలిపారు. మొత్తం పరీక్షలకు 98.5 శాతం విద్యార్థులు హాజరయ్యారు.
News March 17, 2025
ఏడు వారాల నగలంటే ఏంటో తెలుసా?

ప్రతి మహిళకు ఏడువారాల నగలు ఉండాలనే కోరిక ఉంటుంది. కానీ చాలా మందికి 7 వారాల నగలేంటో తెలియదు. ఆదివారం(సూర్యుడు) ధరించేవి కెంపుల కమ్మలు & హారాలు, సోమవారం(చంద్రుడు) ముత్యాల హారం & గాజులు, మంగళవారం(కుజుడు) పగడాల దండలు& ఉంగరాలు, బుధవారం(బుధుడు) పచ్చల పతకాలు& గాజులు, గురువారం(బృహస్పతి) పుష్యరాగం& కమ్మలు& ఉంగరాలు, శుక్రవారం(శుక్రుడు) వజ్రాల హారాలు& వజ్రపు ముక్కుపుడక, శనివారం(శని) నీలమణి హారాలు. share it
News March 17, 2025
నంద్యాల: పోలీసుల గ్రీవెన్స్ డేకు 72 అర్జీల రాక

నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే జరిగింది. మొత్తం 72 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులను విచారించి చట్ట పరిధిలో న్యాయం చేస్తామన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా.. త్వరగా పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.