News March 16, 2025
పెనుబల్లి: మేక పంచాయితీ.. దాడి, ఫిర్యాదు.!

మేక తెచ్చిన పంచాయితీలో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. మండలానికి చెందిన కొందరు యువకులు కారులో టేకులపల్లి సాగర్ కాల్వ వద్ద ఈత కొడుతుండగా, అటుగా వచ్చిన మేకల గుంపులోని ఓ మేక కారుపై ఎక్కడంతో, పశువులు కాపరిని యువకులు కొట్టారు. అది గమనించిన స్థానికులు యువకులను కొట్టడంతో మారేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 18, 2025
ఖమ్మంలో దూసుకెళ్తున్న LRS ఆదాయం

ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. దీంతో ఖమ్మంలో LRS ఆదాయం దూసుకెళ్తుంది. రోజుకు 70 నుంచి 80 దరఖాస్తులకు చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో ఇప్పటికే ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో 1,895 దరఖాస్తులకు చెల్లింపులు జరగగా.. రూ. 10.61 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది
News March 18, 2025
రైళ్లు ఆలస్యం.. ప్రయాణికులు పడిగాపులు..!

ఖమ్మం మీదుగా వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 83 రైళ్లకు ఖమ్మంలో హాల్టింగ్ ఉంది. రైళ్లు రద్దయినప్పుడు కాకుండా మిగతా రోజుల్లో అన్ని రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. మూడోలైన్ నిర్మాణ పనుల కారణంగా రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయని.. పనులు పూర్తయితే అన్ని రైళ్లు సమయానికి నడుస్తాయని అధికారులు వెల్లడించారు.
News March 18, 2025
ఖమ్మం: ఇంటి వద్దకే రాములవారి తలంబ్రాలు: ఆర్ఎం

ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేసినట్లు ఖమ్మం RM సరిరామ్ తెలిపారు. దీనికోసం ఆన్లైన్ లేదా బస్టాండ్ సెంటర్లు మరియు ఏజెంట్ కౌంటర్ లో రూ.151 చెల్లించి బుక్ చేసుకోవచ్చున్నారు. మరిన్ని వివరాలకు ఖమ్మం :9154298583, మధిర :9154298584, సత్తుపల్లి:9154298585, భద్రాచలం:9154298586 కొత్తగూడెం&ఇల్లందు:9154298585, మణుగూరు: 9154298588 నంబర్లకు సంప్రదించాలన్నారు.