News April 4, 2024

పెనుమంట్రలో 110 మంది వాలంటీర్ల రాజీనామా

image

పెనుమంట్ర మండలంలో భారీగా వాలంటీర్లు రాజీనామా చేశారు. పెనుమంట్ర, మార్టేరు, సోమరాజు ఇల్లింద్రపర్రు, మల్లిపూడి, నెగ్గిపూడి, వెలగలేరు, ఆలమూరు తదితర గ్రామాలలో దాదాపు 110 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి సంబంధిత అధికారులకు రాజీనామా పత్రాలు అందచేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతీ విషయలో వాలంటీర్లను బూచీగా చూపిస్తున్నారని, ఈ పరిణామాలతో విసుగు చెంది రాజీనామా చేసినట్లు వారు వెల్లడించారు.

Similar News

News October 31, 2025

ప.గో: డెడ్ బాడీ పార్సిల్ కేసులో రాష్ట్రానికి 4 అవార్డులు

image

ఉండి (M) యండగండి డెడ్ బాడీ పార్సిల్ కేసు చేధనలో రాష్ట్రానికి 4 అవార్డులు దక్కాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజయవాడలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ నయీమ్ అస్మితో పాటు మరో ముగ్గురు అధికారులు అవార్డులు అందుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ , కేంద్రీయ గృహమంత్రి దక్షత పదక్‌లో అవార్డులు ప్రకటించారు. అవార్డులు అందుకున్న నలుగురు అధికారులు ప్రశంసలు అందుకుంటున్నారు.

News October 31, 2025

తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితం: కలెక్టర్

image

తుఫాను కారణంగా జిల్లాలో జరిగిన ప్రాథమిక నష్టం అంచనాలను కలెక్టర్ నాగరాణి గురువారం వివరించారు. ఈ తుఫాను తాకిడికి 91 గ్రామాలు ప్రభావితం అయ్యాయని, 13 గ్రామాలు, 6 పట్టణాలు నీట మునిగాయని తెలిపారు. మొత్తం 13,431.83 హెక్టార్లలో వ్యవసాయం, 299.87 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 93 ఇళ్లు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు.

News October 30, 2025

నరసాపురం: చెరువులో పడి దివ్యాంగుడి మృతి

image

నరసాపురం మండలం లిఖితపూడి గ్రామానికి చెందిన దివ్యాంగుడు పెచ్చేట్టి సుబ్బారావు (75) గురువారం ముఖం కడుక్కోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్, ఫైర్ సిబ్బంది తీవ్రంగా గాలించగా, సాయంత్రం చెరువులో సుబ్బారావు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.