News December 5, 2024
పెనుమంట్ర: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రులో గురువారం ఆటో బైక్ ఢీకొన్న ప్రమాదంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హరి(15) మృతి చెందాడు. మృతుడు కోత మెషీన్‌పై పని నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు పెనుమంట్ర పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం 108లో తణుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
Similar News
News December 9, 2025
జిల్లాలో యూరియా కొరత లేదు: ప.గో కలెక్టర్

ప.గో జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పంటకు, యూరియాకు సంబంధించి జిల్లాస్థాయిలో 83310 56742 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. రైతులు యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కార చర్యలు తీసుకుంటామన్నారు.
News December 9, 2025
భూ సర్వే రోవర్లను సిద్ధం చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి రోవర్స్ పనితీరును మంగళవారం పరిశీలించారు. జిల్లాలో మొత్తం 114 రోవర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిలో 42 మాత్రమే పనిచేస్తున్నాయని వివరించారు. మిగిలిన వాటిలో కొన్ని రీఛార్జి చేయవలసి ఉండగా, మరికొన్ని రిపేర్లు చేయవలసినవి ఉన్నాయని సంబంధిత అధికారులు జేసీకి వివరించారు. రోవర్లకు రీఛార్జ్ చేసుకొని, రిపేర్లు ఉంటే చూసుకోవాలని జేసీ సూచించారు.
News December 9, 2025
ప.గో జిల్లా ప్రజలారా.. ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి

ఉమ్మడి ప.గో జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. ఏసీబీ డీఎస్పీ 9440446157, సీఐలు 9440446158, 9440446159, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయవచ్చాన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. (నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినం)


