News July 16, 2024

పెన్‌పహాడ్: గురుకుల విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఐదవ తరగతి విద్యార్థిని మృతి చెందిన ఘటన పెన్‌పహాడ్‌ మండలం దోసపాడు గురుకుల పాఠశాలలో జరిగింది. నూతనకల్ మండలం మాచనపల్లికి చెందిన సోమయ్య-నవ్య దంపతుల కూతురు సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతుంది. ఈరోజు ఉదయం మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 11, 2024

డీఎస్సీ-2024 కౌన్సిలింగ్‌కు ఆదేశాలు రాలేదు: డీఈఓ బిక్షపతి

image

డీఎస్సీ-2024 కౌన్సిలింగ్ విషయంపై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అని డీఈఓ బిక్షపతి తెలిపారు. ప్రస్తుతం నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు తమ వద్ద రిపోర్టు చేస్తున్నారు. గురు, శుక్రవారాలు ఉపాధ్యాయుల రిపోర్టింగ్కు కు అవకాశం ఇచ్చాం అని అన్నారు. దసరాకు ముందు పోస్టింగ్ లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి దసరా తర్వాతే కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇస్తాం అని పేర్కొన్నారు.

News October 11, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ నియోజకవర్గం జీవీ గూడెం, తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ, మునుగోడు నియోజకవర్గం కల్వకుంట్ల గ్రామంలో ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నారు.

News October 11, 2024

నల్లగొండ: ‘డీఎస్సీ- 2024 ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేయాలి’

image

డీఎస్సీ-2024 లో ఎంపికైన అభ్యర్థులు 10,11 తేదీలలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి తెలిపారు. డీఎస్సీ -2024 ఎంపికైన అభ్యర్థులు రిపోర్ట్ చేసే సమయంలో ఎల్బీ స్టేడియంలో అందించిన అపాయింట్ ఆర్డర్ జిరాక్స్ జత చేసి సంబంధిత కౌంటర్లు రిపోర్ట్ చేయాలని విద్యాశాఖ అధికారి బి.బిక్షపతి తెలిపారు.