News February 28, 2025
పెన్షన్లకు రూ. 98.20 కోట్లు విడుదల: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలో మార్చి 1వ తేదీన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల కింద 2,29,913 పెన్షన్లకు రూ. 98.20 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం పెన్షన్ల పంపిణీపై వివిధ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శనివారం ఉదయం 7 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించి, ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.
Similar News
News March 25, 2025
పల్నాడు: విడదల రజనిని అరెస్ట్ చేస్తారా..?

చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని అరెస్టు కానున్నారా? అనే విషయంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్ల నగదు అక్రమంగా వసూలు చేసినట్లు ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ వంటి కీలక నేతలు ఆమెపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
News March 25, 2025
తిరుపతి: సైలెంట్ మోడ్‌లో వైసీపీ నేతలు.?

తిరుపతి(D)లో YCP నేతల పరిస్థితి కొంచెం ఇష్టం-కొంచెంకష్టం అన్నట్లు మారింది. భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి, రోజా, మోహిత్ రెడ్డి మినహా మిగిలిన వారు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఉన్నారని సమాచారం. బియ్యపు మధుసూదన్ రెడ్డి, చెవిరెడ్డి, సత్యవేడు ఇన్‌ఛార్జ్ రాజేశ్ వంటి నేతలు నియోజకవర్గంలో పెద్దగా కనబడటం లేదని టాక్. చెవిరెడ్డి సైతం మునుపటి స్థాయిలో చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది.
News March 25, 2025
రూ.లక్షలు ఖర్చు పెట్టి నన్ను ట్రోల్ చేయిస్తున్నారు: పూజా హెగ్డే

కొంతమంది రూ.లక్షలు ఖర్చుపెట్టి మరీ తనను ట్రోల్ చేయిస్తున్నారని హీరోయిన్ పూజా హెగ్డే ఓ ఇంటర్వ్యూలో వాపోయారు. ‘నాపై ట్రోలింగ్ చేస్తున్న మీమ్ పేజీలను కాంటాక్ట్ చేయమని మా టీమ్‌కు చెప్పాను. ఈ పని చేసేందుకు తమకు రూ. లక్షలు ఇస్తున్నారని మా టీమ్‌తో మీమర్స్ చెప్పారు. ట్రోలింగ్ ఆపాలంటే నేను కూడా అంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు’ అని పేర్కొన్నారు. తెలుగులో ఆమె చివరిగా ఎఫ్-3లో స్పెషల్ సాంగ్‌లో కనిపించారు.