News November 9, 2024

పెన్షన్లు పెంపు ఎన్నడు రేవంత్ రెడ్డి..?: హరీశ్ రావు

image

వృద్ధులకు రూ.4,000 వికలాంగులకు రూ.6,000 పెన్షన్ పెంచుతాననని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇంకెప్పుడు పెంచుతావని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. 11నెలల పరిపాలనలో పేదవాళ్లకు ఒక్క ఇల్లు అయినా కట్టించావా అని నిలదీశారు. CM చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదన్నారు.

Similar News

News December 12, 2025

ప్రచారం ముగిసింది.. ప్రలోభం మిగిలింది !

image

మెదక్ జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఓటర్లను ప్రభావితం చేయడం మిగిలింది. మెదక్ నియోజకవర్గంలో మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరఫున ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారం చేశారు.

News December 12, 2025

మెదక్: రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

image

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్, 163 BNSS అమల్లో ఉంటాయని చెప్పారు. ర్యాలీలు, ప్రచారం, గుమిగూడడం పూర్తిగా నిషేధం. ఎన్నికలు శాంతియుతంగా జరుగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.

News December 12, 2025

మెదక్‌లో ప్రశాంతంగా తొలి విడత పోలింగ్ పూర్తి

image

మెదక్ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. రెండో, మూడో విడతల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేసిన సిబ్బందికి, ముఖ్యంగా పెద్ద ఎత్తున పాల్గొన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముందు విడతల మాదిరిగానే 14, 17 తేదీల పోలింగ్‌ను నిర్వహించేందుకు అధికారులను కలెక్టర్ సూచించారు.