News April 29, 2024
పెన్షన్ల కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు: కలెక్టర్

సామాజిక పింఛన్ల కోసం లబ్ధిదారులు ఎక్కడికి వెళ్ళనవసరం లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. మే 1న పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వికలాంగులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు మంచానికి పరిమితమైన వారి ఇంటి వద్దకే పెన్షన్ నగదు రూపంలో అందించడం జరుగుతుందన్నారు. మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. జిల్లాలో 1,64,899 మంది పింఛన్దారులు ఉన్నట్లు తెలిపారు.
Similar News
News February 26, 2026
విశాఖకు రూ.32,373 కోట్ల రుణ లక్ష్యం

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యతా రంగాలకు నాబర్డు రూ.32,373 కోట్ల పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ విడుదల చేసింది. కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బ్యాంకర్ల సమావేశంలో ప్రణాళికను ఆవిష్కరించారు. ఇందులో ఎంఎస్‌ఎంఈలకు రూ.22,368.75 కోట్లు, వ్యవసాయానికి రూ.4,603.5 కోట్లు, ఇతర రంగాలకు రూ.5,401.1 కోట్లు కేటాయించారు. బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు రుణాలు విస్తరించాలని సూచించారు.
News February 25, 2026
ఏపీ మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ టెక్నాలజీ సెంటర్?

విశాఖలోని A.P మెడిటెక్ జోన్‌లో ఇండో-జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. జర్మన్ కాన్సుల్ జనరల్ ప్రతినిధి బృందం పర్యాటనలో ఈ ప్రతిపాదనపై చర్చలు జరిగాయి. మెడ్‌టెక్ రంగంలో సంయుక్త పరిశోధన, ఆధునిక సాంకేతిక అభివృద్ధికి ఇది కీలకం కానుంది. ఇదే రోజున రోబోటిక్స్ సంస్థ Cogmac Technologies మెడిటెక్ జోన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
News February 25, 2026
రాజాంలో పద్మం సిల్వర్ జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్

పద్మం సిల్వర్ జువెలరీ బ్రాంచ్‌ను రాజాంలోని పాలకొండ రోడ్డులో గల CMRలో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను టీడీపీ నాయకుడు కొండ్రు జగదీశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న ఆభరణాలతో పాటు అద్భుతమైన ఆఫర్లను పెట్టారు. సిల్వర్ జువెలరీకి కూడా మార్కెంట్‌లో డిమాండ్ పెరిగిందని CMR గ్రూపుల అధినేత మావూరి వెంకట రమణ పేర్కొన్నారు.


