News June 28, 2024

పెన్షన్ల పంపిణీకి పక్కా ఏర్పాట్లు: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో 2,44,302 మంది లబ్ధిదారులకు జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ పీ.ప్రశాంతి వెల్లడించారు. పెన్షన్లకు సంబంధించి జిల్లాలో 9,552 క్లస్టర్లను ఉద్యోగులతో మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. పెన్షనర్లకు మంజూరైన రూ.165.13 కోట్ల నగదును ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

కోరుకొండలో గంజాయి ముఠా గుట్టురట్టు

image

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను కోరుకొండ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. సీఐ సత్యకిషోర్ తెలిపిన వివరాల ప్రకారం.. నరసాపురం-కనుపూరు రోడ్డులో గంజాయి చేతులు మారుతుండగా దాడి చేసి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరి జిల్లా దారకొండ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా పట్టుబడిన ఆరుగురిని అరెస్టు చేశారు. స్విఫ్ట్ కారు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

News December 4, 2025

ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో

image

ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ఇన్‌స్ట్రక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. అనపర్తి, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం, సీతానగరం, రాజానగరం, కడియం పరిధిలోని పాఠశాలల్లో మొత్తం 25 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.

News December 4, 2025

రాజమండ్రి: నిర్మలా సీతారామన్‌కు MP పురంధేశ్వరి రిక్వెస్ట్!

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బుధవారం భేటీ అయ్యారు. పొగాకు బోర్డులో మానవ వనరుల పునర్వ్యవస్థీకరణ, పొగాకుపై GST, పంటకు సంబంధించిన పలు విషయాలను ఆమె వివరించారు. టొబాకో బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్ కూడా పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కారానికి హామీ ఇచ్చారని పురంధేశ్వరి పేర్కొన్నారు.