News June 30, 2024
పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: పల్నాడు కలెక్టర్

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లత్కర్ తెలిపారు. జులై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన తెలిపారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివానం మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 5, 2026
తెనాలి సబ్ కలెక్టర్ గ్రీవెన్స్కు 7 ఫిర్యాదులు

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 7 ఫిర్యాదులు వచ్చాయి. సబ్ కలెక్టర్ సంజనా సింహ వేరే అధికారిక కార్యక్రమానికి వెళ్లడంతో కార్యాలయ అధికారులే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 1, మున్సిపాలిటీ 2, దేవాదాయ శాఖ 1, పంచాయతీ రాజ్ విభాగానికి 3 అర్జీలు చొప్పున మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఆయా విభాగాలకు పంపి పరిష్కరిస్తామని తెలియజేశారు.
News January 5, 2026
GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10:35 గంటలకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 10:45 గంటలకు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు సచివాలయానికి వస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీజీఎస్పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
News January 5, 2026
నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు రాక

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు రానున్నారు. ఉదయం 10:25 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 ని.లకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.


