News June 30, 2024

పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం: పల్నాడు కలెక్టర్

image

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ బి లత్కర్ తెలిపారు. జులై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన తెలిపారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివానం మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News July 11, 2025

మంగళగిరి: ముత్యాల పందిరి వాహన ఉత్సవంలో అపశృతి

image

మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముత్యాల పందిరి వాహనం ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ధ్వజస్తంభం వద్ద ఊరేగింపుగా బయలుదేరిన క్రమంలో వాహనం ఒక్కసారిగా ఒరిగిపోయింది. దేవస్థాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి, ఉత్సవ విగ్రహాలు కింద పడకుండా కాపాడారు. ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News July 10, 2025

చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్: హీరా లాల్

image

జాతీయ చేపల రైతుల దినోత్సవాన్ని గురువారం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మత్స్య శాఖ సైంటిస్ట్ హీరా లాల్ మాట్లాడారు. మంచినీటిలో చేపలను పెంచడం ద్వారా ఉత్పత్తిలో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తద్వారా ఎగుమతులు ఆశాజనకంగా ఉంటాయని ఆయన వెల్లడించారు. ఆక్వా రంగంలో ఎగుమతులు పెరిగే విధంగా అన్ని చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.

News July 10, 2025

GNT: ‘అరటిగెల కోసే కత్తితో పొడిచి చంపారు’

image

స్తంభాల గరువుకు చెందిన కరిముల్లా హత్య కేసును పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల మేరకు.. కరిముల్లా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అతని భార్య కరిముల్లా వదిన వద్ద ఉంటుంది. అతని వదినకు స్థానికంగా ఉండే ఓ ఫైనాన్షియర్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై హత్యకు గురైన వ్యక్తి ఆ ఫైనాన్షియర్‌పై కక్ష పెంచుకున్నాడు. దీంతో ఫైనాన్షియర్ మరో వ్యక్తి సహాయంతో అరటిగెల కోసే కత్తితో కరిముల్లాను హత్య చేయించాడని చెప్పారు.