News October 29, 2024
పెన్షన్ల పంపిణీపై ప్రకాశం జిల్లా కలెక్టర్ సమీక్ష
నవంబర్ నెలలో జిల్లాలో పంపిణీ చేయనున్న పెన్షన్ల పంపిణీపై జిల్లా అధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సమీక్ష నిర్వహించారు. పెన్షన్స్ పంపిణీ గురించి సమీక్షిస్తూ.. 31వ తేదీన దీపావళి పండుగ నేపథ్యంలో ఈనెల 30వ తేదీనే ముందస్తుగానే బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసుకోవాలన్నారు. 1వ తేదీన ఉదయం 5గంటలకి లబ్ధిదారులకు సచివాలయాల సిబ్బంది పెన్షన్లు పంపిణీ ప్రారంభించాలన్నారు.
Similar News
News October 31, 2024
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు పోలీసుల నివాళి
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లాపోలీసుల ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివాస్ నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిబ్బందిలో ఐక్యతాభావం పెంపొందేలా పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు.
News October 31, 2024
YSపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు
ఆస్తుల గొడవలతో పెద్దాయన(YS) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YS ఉన్నప్పుడే జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈదోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. ఆయన అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. మా ఆస్తులు మైనస్ అవుతుంటే వాళ్ల ఆస్తులు తరాలు కూర్చుని తిన్నా తరగనవిగా ఎలా మారాయి’ అని ప్రశ్నించారు.
News October 30, 2024
ప్రకాశం జిల్లాలో విషాదం.. ఇద్దరు మృతి?
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో మంగళవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడియం ఆదిలక్ష్మి(42), మల్లవరపు సుబ్బారెడ్డి (55) బర్రెలను మేపడానికి పొలం వెళ్లారు. బర్రెలు నీటిలోకి వెళ్లాయని మూసీ నది దాటుతుండగా నీటి ప్రవాహానికి ఇద్దరు కొట్టుకుపోయారు. ఆదిలక్ష్మి మృతదేహం బుధవారం లభించగా.. గల్లంతైన సుబ్బారెడ్డి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.