News February 28, 2025

పెన్షన్ల పంపిణీ కోసం రూ.112.06 కోట్లు: తిరుపతి కలెక్టర్

image

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను మార్చి 1న ఉదయం లబ్ధిదారుల ఇంటి వద్దనే సిబ్బంది పంపిణీ చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 2,62,461 మంది పెన్షన్ దారులకు సుమారు 112.06 కోట్ల రూపాయలను పంపిణీకి  సిద్ధం చేసినట్లు చెప్పారు. ఉదయం 7గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందని ఆయన పేర్కొన్నారు. 

Similar News

News March 1, 2025

తిరుపతి: CC కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు 

image

ఇంటర్ పరీక్షలకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 86 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఇంటర్ ప్రథమ సం.లో 32,213 మంది, ద్వితీయ సం.లో 30,548 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కోట(M) అంబేడ్కర్ గురుకులం సెంటర్‌లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు.

News March 1, 2025

ఏలూరు: 55 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 33,511 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు చెప్పారు. ఉదయం 8.30 గంటల కల్లా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్‌గా ప్రకటించామని, సీసీ కెమెరాల నిఘా ఉంటుందని పేర్కొన్నారు.

News March 1, 2025

పార్వతీపురంలో మెుదలైన పింఛన్ల పంపిణీ

image

పార్వతీపురం మన్యం జిల్లాలో మార్చి నెల పింఛన్ల పంపిణీ ప్రక్రియ మొదలైంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేస్తున్నారు. ఈ నెల నుంచి ఉదయం 7 గంటల నుంచి పింఛన్ల పంపిణీని చేపడుతున్నారు. కాగా జిల్లాలో 1.48 లక్షల మంది పెన్షన్ దారులున్నారు. వీరందరికీ రూ.59 కోట్ల మేర పంపిణీ చేయాల్సి ఉంది.

error: Content is protected !!