News March 22, 2024
పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. 30 వరకు పెన్షన్ల పంపిణీ
నల్గొండ జిల్లాలో నేటి నుంచి మార్చి 30వ తేదీ వరకు ఆసరా పింఛన్లు (వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళ పెన్షన్లు) పంపిణీ చేయనున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పింఛను మొత్తము నేరుగా సంబంధిత పోస్టల్ శాఖ వారి వద్ద నుండి పొందాలని.. మధ్య దళారులను నమ్మ వద్దని సూచించారు.
Similar News
News September 14, 2024
మదర్ డైరీ ఛైర్మన్‌గా మధుసూదన్ రెడ్డి
రంగారెడ్డి నల్లగొండ మదర్ డైరీ ఛైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేశారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ,భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
News September 14, 2024
నల్లగొండ: ఇంటర్ విద్యతో ఎంజీ యూనివర్సిటీలో PG కోర్సు
ఇంటర్ విద్యతో నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ (PG ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) కోర్సు చేయొచ్చని ఎంజీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై.ప్రశాంతి తెలిపారు. ఈ కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( CPGET – 2024) ద్వారా అర్హత సాధించి యూనివర్సిటీని ఎంచుకోవాలని సూచించారు.
News September 14, 2024
SRPT: కొడుకును హత్య చేసిన తండ్రి అరెస్ట్: డీఎస్పీ
మద్యానికి బానిసై తరచూ వేధిస్తున్న కొడుకును తండ్రి హత్య చేసిన ఘటనలో తండ్రి పంతులను రిమాండ్‌కు పంపినట్లు సూర్యాపేటలో DSP రవి తెలిపారు. ఆత్మకూర్ (ఎస్) మండలం బాపూజీతండాకు చెందిన బాణోత్ కిరణ్ ఈ నెల 11న రాత్రి మద్యం తాగి వచ్చిన కిరణ్ తండ్రితో ఘర్షణకు దిగి దాడి చేశాడు. ఆవేశానికిలోనైన తండ్రి గొడ్డలితో కిరణ్‌ను హత్య చేసినట్లు తెలిపారు. గ్రామీణ సీఐ సురేందర్ రెడ్డి, ఎస్ఐ సైదులు అన్నారు.