News August 2, 2024
పెన్షన్ పంపిణీలో చిత్తూరుకు 7, తిరుపతికి 8వ స్థానం

రాష్ట్రవ్యాప్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు 7వ స్థానం, తిరుపతి జిల్లాకు 8వ స్థానం లభించినట్లు జిల్లా కలెక్టరేట్ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో 270619 మంది ఉండగా 264268 మందికి పెన్షన్ పంపిణీ జరిగినట్లు తెలిపారు. 97.67 శాతం పంపిణీతో 7వ స్థానంలో చిత్తూరు జిల్లా ఉన్నట్లు తెలిపారు. 267772 మందికిగాను 261291 పంపిణీ చేసి 97.58 శాతంతో 8వ స్థానంలో తిరుపతి జిల్లా ఉన్నట్లు తెలిపారు.
Similar News
News January 7, 2026
9 నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో 9, 10 తేదీల్లో చిత్తూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News January 6, 2026
చిత్తూరు: యూరియా వాడకంతో పాలు తగ్గుతాయి..!

ఐరాల మండలం చిన్నకంపల్లిలో జిల్లా వ్యవసాయ అధికారి మురళి ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ యూరియా వాడటంతో కలిగే నష్టాలను రైతులకు వివరించారు. తగిన మోతాదులో యూరియా వాడితేనే పంట దిగుబడి పెరుగి.. చీడ పీడలు తగ్గుతాయని చెప్పారు. వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ.. పశుగ్రాసానికి యూరియా వాడకంతో పాలు, వెన్న శాతం తగ్గుతాయని తెలిపారు.
News January 6, 2026
చిత్తూరు జిల్లాలో తగ్గిన పంచాయతీలు

పునర్విభజన కారణంగా చిత్తూరు జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 696 పంచాయతీలున్న జిల్లాలో తాజాగా ఆ సంఖ్య 621కి తగ్గింది.75 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు వెళ్లాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సదుం మండలాలను మదనపల్లె జిల్లాలో కలపడంతో 32గా ఉన్న మండలాల సంఖ్య 28కి తగ్గింది.


