News August 2, 2024
పెన్షన్ పంపిణీలో YSR జిల్లాకు 4వ స్థానం
కడప జిల్లాలో గురువారం నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలో జిల్లాకు నాలుగవ స్థానం లభించింది. మొత్తం 2,64,013 మంది లబ్ధిదారులకు గాను.. 2,58,100 మంది (97.76%)కి పెన్షన్‌ను పంపిణీ చేశామన్నారు. అందుకుగాను పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ శివశంకర్ అభినందనలు తెలిపారు.
Similar News
News October 12, 2024
అన్నమయ్య జిల్లా ప్రజలకు కలెక్టర్ దసరా శుభాకాంక్షలు
విజయదశమి పర్వదిన సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, అన్ని వర్గాల వారు నిత్యం సంతోషంగా ఉండాలని అభిలాషించారు.
News October 11, 2024
కడప జిల్లా ప్రజలకు ఎస్పీ దసరా శుభాకాంక్షలు
విజయదశమి పర్వదిన సందర్బంగా జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు ఎస్పీ వీ.హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ప్రతి ఒక్కరూ సంతోషంతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, అన్ని వర్గాల వారు నిత్యం సంతోషంగా ఉండాలని అభిలాషించారు.
News October 11, 2024
కడప జిల్లా కలెక్టర్ బదిలీ
కడప కలెక్టర్ శివశంకర్‌ను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర, తెలంగాణ క్యాడర్ విభజనపై కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన సమయంలో అధికారులను ఏపీ, తెలంగాణకు కేంద్రం సర్దుబాటు చేసింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన కడప కలెక్టర్ శివశంకర్‌ను తిరిగి ఆ రాష్ట్రానికి కేటాయించారు. ఈ నెల 16లోపు రిపోర్ట్ చేయాలని పేర్కొంది.