News January 22, 2025
పెబ్బేరులో భారీ మొసలి పట్టివేత

పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లిలో నివాస ప్రాంతంలోకి భారీ మొసలి రావటంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వారు వెంటనే సాగర్ స్నేక్ సొసైటీ కృష్ణసాగర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమాచారమందివ్వడంతో గ్రామానికి చేరుకొని వారు చాకచక్యంతో భారీ మొసలిని పట్టుకున్నారు. 11 ఫీట్ల పొడవు, 230 కేజీల బరువు ఉన్న మొసలిని బంధించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.
Similar News
News October 23, 2025
మేయర్ దంపతుల హత్య కేసులో రేపు తీర్పు

రాష్ట్రంలో సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యపై రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 21 మంది నిందితులు 122 మంది సాక్షుల విచారణ కోర్టు పూర్తి చేసింది. 10 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. కోర్టు వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.
News October 23, 2025
ఖమ్మం: 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు మూసివేత

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA)కి చెందిన 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను అధికారులు తొలగించారు. పాల్వంచలో 35 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి, 2010లో నాగారం కాలనీకి తరలించిన చెక్పోస్టును మూసివేశారు. అశ్వారావుపేటలో 2014లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుతో పాటు, సత్తుపల్లి మండలంలోని ముత్తుగూడెం చెక్పోస్టును కూడా తొలగించారు.
News October 23, 2025
థైరాయిడ్ పేషెంట్లకు ఈ ఆహారం మంచిది

థైరాయిడ్ హార్మోను సవ్యంగా విడుదలైనప్పుడే జీవక్రియల పనితీరు బాగుంటుంది. లేదంటే పలు సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు. దీనికోసం మందులతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు. అయోడిన్ ఉన్న ఉప్పు, చిక్కుళ్లు, బటానీలు, ఇన్ఫ్లమేషన్ తగ్గించే విటమిన్ C ఉండే ఫ్రూట్స్, ఫిష్, ఓట్స్, మిల్లెట్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. ✍️ మహిళలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీలోకి వెళ్లండి.


