News March 21, 2025

పెబ్బేరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కేసు నమోదు: ఎస్ఐ

image

అక్రమాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి రూ.లక్షలు దోచుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు గోనేల ఎల్లయ్య, బొడ్డుపల్లి రాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెబ్బేరు ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి గురువారం తెలిపారు. సర్వే నంబర్‌పై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వారు ప్లాట్లు విక్రయించారని గద్వాల్‌కు చెందిన కళ్యాణ్ కుమార్ ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News April 22, 2025

భువనగిరి: మూసీ ఒడ్డున క్షుద్రపూజలు 

image

భువనగిరి జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. రామన్నపేట మండలం లక్షాపురం మూసీ నది ఒడ్డుపై తరచూ క్షుద్రపూజలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్తే పూజలు చేసిన సామగ్రి దర్శనం ఇస్తుందంటున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. 

News April 22, 2025

గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మ ప్రత్యేక అలంకరణ

image

గద్వాల జిల్లా జమ్మిచేడు జమ్ములమ్మకు మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి ఆలయ ఆవరణలో జమ్ములమ్మను చేసి సారేతో కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

News April 22, 2025

విజయనగరం: Pic Of The Day

image

పోషకాహారంపై చిన్నారి వేషధారణ ఆలోచింజేస్తోంది. తెర్లాం మండలం కాగాం గ్రామానికి చెందిన జొన్నాడ సరస్వతి పోషణ పక్వాడాలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంగన్వాడీ కార్యకర్తలు సరస్వతితో కాయగూరలు, ఆకుకూరలతో వేషధారణ వేయించారు. చెవి దిద్దులుగా టమాటాలు, మెడలో క్యారెట్, గోరు చిక్కుడు హారం, నడుముకు కరివేపాకు కట్టారు. గర్భిణులు ఏ ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందో ఈ చిన్నారి ప్రదర్శనతో వివరించింది. 

error: Content is protected !!