News February 21, 2025
పెబ్బేరు: అత్యాచారయత్నం కేసు.. నిందితుడికి రిమాండ్

పెబ్బేరు పరిధిలోని చెలిమిల్ల గ్రామానికి చెందిన మహిళను పెబ్బేరుకు చెందిన ఎరుకలి రాముడు బలవంతంగా చెలిమిల్ల రామాలయం వెనుక వైపునకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. ఈ కేసులో ఎరుకలి రాముడుకు వనపర్తి JFCM న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని పెబ్బేరు పోలీసులు మహబూబ్నగర్ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించినట్లు స్థానిక ఎస్‌హెచ్ఓ హరి ప్రసాద్ రెడ్డి తెలిపారు.
Similar News
News November 17, 2025
AP న్యూస్ అప్‌డేట్స్

*మంత్రి సత్యకుమార్ పేరిట TTD నకిలీ లెటర్లు.. VJA పోలీసులకు PA ఫిర్యాదు
*పరకామణి కేసు వెనుక ఎవరున్నారో తేల్చాలి: మంత్రి పార్థసారథి
*తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
*డిజిటల్ అరెస్టుల కట్టడికి ‘సైబర్ సురక్ష’ పేరిట నెల రోజులపాటు VJA పోలీసుల అవగాహన కార్యక్రమాలు
*రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని JAC నిర్ణయం
News November 17, 2025
చిత్తూరు: కుంకీ ఏనుగు జయంత్‌కు మస్త్

కుంకి ఏనుగుల్లో ఒకటైన జయంత్‌కు మస్త్ రావడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య మగ ఏనుగులు పునరుత్పత్తి హార్మోన్ల పెరుగుదల వలన మస్త్ వస్తుంది. ఈ సమయంలో ఏనుగులు చాలా దూకుడుగా ప్రవర్తిస్తాయి. ఏనుగులు ఈ దశలో అదుపు తప్పి ప్రవర్తించి, మనుషులపై లేదా ఇతర ఏనుగులపై దాడి చేసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో జయంత్‌ను వెటర్నరీ డాక్టర్ పరిశీలించారు.