News March 31, 2025
పెబ్బేరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన పెబ్బేరులో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జాతీయ రహదారిపై గుర్తుతెలియని మహిళ(40)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడకక్కడే మృతిచెందింది. మృతురాలు మతిస్తిమితం లేక రోడ్డు వెంట తిరుగుతుందా లేక ఇంకేమైనా కారణాల అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Similar News
News November 22, 2025
ఏలూరు జిల్లాకు ఈనెల 24న రానున్న పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్‌లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎందుకు చేస్తారు?

ఏడు శనివారాల వ్రతాన్ని ప్రధానంగా శని గ్రహ దోషాల నివారణ కోసం చేస్తారు. అలాగే ఏడు కొండలవాడైన వేంకటేశ్వరస్వామి దయను పొందడం కోసం ఆచరిస్తారు. నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని చేస్తే.. ఇంట్లో సమస్యలు, అప్పుల బాధలు పోతాయని నమ్మకం. వ్రత ప్రభావంతో అనుకున్న పనులన్నీ సవ్యంగా నెరవేరుతాయని భావిస్తారు. వ్రతం పూర్తయ్యాక ముడుపును తీసుకుని తిరుమల వెంకన్నను దర్శించుకుంటే కష్టాలు కొండెక్కిపోతాయని ప్రగాఢ విశ్వాసం.
News November 22, 2025
100kgల సమీకృత దాణా తయారీకి ఇవి అవసరం

☛ మొక్కజొన్న/జొన్న గింజలు-30kgలు
☛ వేరుశనగ చెక్క- 15kgలు ☛ పత్తి గింజల చెక్క-15kgలు
☛ వరి తవుడు/గోధుమ తవుడు – 20kgలు
☛ నూనె తీసిన తవుడు – 17kgలు
☛ ఖనిజ లవణ మిశ్రమం – 2kgలు
☛ ఉప్పు/లవణం – 1 కిలో
పైన సూచించిన పరిమాణంలో పదార్థాలతో సమీకృత దాణా తయారు చేసుకోవచ్చు. దీని తయారీ, వినియోగంలో ఒకసారి వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.


