News September 28, 2024
పెబ్బేరు: శేరుపల్లిలో ఐదు రోజులుగా నిలిచిన నీటి సరఫరా
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలంలోని శేరుపల్లిలో 5రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. వెంకటాపురం శేరుపల్లి మధ్యన నిర్మిస్తున్న బ్రిడ్జి పనుల్లో పైపులైన్ పగిలిపోవడంతో సమస్య ఏర్పడింది. మరమ్మతు చేపట్టాలని గ్రామస్థులు అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే పంచాయతీ సిబ్బంది ట్యాంకులతో గ్రామాల్లోకి నీటిని తీసుకొస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 5, 2024
కల్వకుర్తి: సూర్య ప్రకాశ్ రావును అభినందించిన కేటీఆర్
కల్వకుర్తి పట్టణ సమీపంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో ఇటీవల జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన సూర్య ప్రకాశ్ రావును మాజీ మంత్రి కేటీఆర్ శనివారం అభినందించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి వారు కేటీఆర్‌ను కలిశారు.
News October 5, 2024
కొడంగల్: DSC ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ, జిల్లాస్థాయిలో 3వ ర్యాంక్
కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లకుంటకు చెందిన తిరుమలేశ్ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు జిల్లాస్థాయిలో 3వ ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నాడు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
News October 5, 2024
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేటి వర్షపాతం వివరాలవే
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా గద్వాల జిల్లా కల్లూరు తిమ్మన్న దొడ్డిలో 49.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 43.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా వెలుగొండలో 35.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ధన్వాడలో 33.0 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.