News July 18, 2024
పెబ్బేరు: హత్య కేసులో ముగ్గురికి రిమాండ్

పెబ్బేరు పట్టణంలోని చెలిమిల్లలో ఈనెల 13న నాగరాల నర్సింహ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనపై బుధవారం ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. మృతుడి కుమారుడు శివకుమార్, అతని భార్య సుహాసిని, తల్లి గోవిందమ్మలు కలిసి గొడ్డలితో నరికి చంపినట్లు ఎస్సై చెప్పారు. నర్సింహ మద్యానికి బానిసై తమకు ఉన్న పొలాన్ని అమ్ముతాడనే అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపారు.
Similar News
News October 17, 2025
‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.
News October 17, 2025
MBNR: రూ.100 కోట్ల ‘PM–USHA’ పనులు వేగవంతం- VC

పీయూలో ఇంజినీరింగ్ కళాశాల,లా కళాశాల, కొత్త హాస్టళ్లు, పరిశోధన కేంద్రాలు వంటి ప్రాజెక్టులు రూ.100 కోట్ల PM–USHA పథకం కింద వేగంగా అభివృద్ధి చెందుతుందని వీసీ ఆచార్య డాక్టర్ జిఎన్.శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఐదు క్యాంపస్ కళాశాలలు, 3 పీజీ సెంటర్లు, 24 కోర్సులు కొనసాగుతున్నాయని, NSS, క్రీడా, పర్యావరణ, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని’ ప్రశంసించారు.
News October 16, 2025
మహబూబ్‌నగర్: కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్క నాటిన గవర్నర్

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఈరోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.
కలెక్టరేట్ ప్రాంగణంలో గవర్నర్ మొక్క నాటి, నీళ్లు పోశారు. ఈ సమావేశంలో టీబీ నియంత్రణ చర్యలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల సమన్వయం వంటి ముఖ్య అంశాలపై చర్చించారు.