News April 16, 2025
పెబ్బేరు: GREAT.. మరణించిన ఫ్రెండ్ కుటుంబానికి సాయం

పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో 2009లో తమతో చదివిన 10వ తరగతి చిన్ననాటి మిత్రుడు రాజశేఖర్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. విషయం తెలిసి చలించిపోయిన తోటి స్నేహితులంతా కలిసి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి మంగళవారం రూ.80,000 జమ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. వారిని స్థానికులు అభినందించారు. కష్టకాలంలో తోడుగా నిలిచే వారే నిజమైన స్నేహితులని తెలిపారు.
Similar News
News November 23, 2025
నేడు కల్లిపాడుతో పల్నాడు ఉత్సవాల ముగింపు

పల్నాడు వీరుల ఉత్సవాలలో నేడు ఐదవ రోజు కల్లిపాడు జరుపుకునే ముఖ్యమైన యుద్ధ ఘట్టం. కారంపూడిలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో యుద్ధంలో వీరులైన వారి ఆత్మలను స్మరించి, ఆయుధ పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాలలో కోడిపోరు, లంకన్న ఒరుగు వంటి యుద్ధ సన్నివేశాలను పాత్రధారులు గట్టిగా ఆచరిస్తారు. కల్లిపాడు రోజున, అసువులు బాసిన యుద్ధ వీరుల త్యాగాలను, జరిగిన ఘట్టాలను గుర్తు చేసుకుంటూ పల్నాడు ఉత్సవాలను ముగిస్తారు.
News November 23, 2025
పల్నాడు: పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శ్రీనివాసరావు

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కళ్యాణం శివ శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. పల్నాడు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు, జనసేన ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న శ్రీనివాసరావు, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపి బొకేను అందజేశారు.
News November 23, 2025
ఇలా అయితే భవిష్యత్‌లో HYDకు గండమే!

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరద ప్రవాహాంతో వచ్చే వ్యర్థాలు అడుగున చేరి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవల నీటి వనరుల విభాగం ఉన్నతస్థాయి కమిటీ పరిశీలనలో భారీగా పూడిక పేరుకుపోయి నీటి సామర్థ్యం సాధారణ స్థాయి కంటే తగ్గుముఖం పట్టినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నీటి సామర్థ్యం 60% కంటే దిగువకు పడిపోతే భవిష్యత్తులో నీటి తరలింపు సమస్యగా మారే ప్రమాదం ఉందని వెల్లడైంది.


