News April 16, 2025

పెబ్బేరు: GREAT.. మరణించిన ఫ్రెండ్ కుటుంబానికి సాయం 

image

పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో 2009లో తమతో చదివిన 10వ తరగతి చిన్ననాటి మిత్రుడు రాజశేఖర్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. విషయం తెలిసి చలించిపోయిన తోటి స్నేహితులంతా కలిసి బాధిత కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి మంగళవారం రూ.80,000 జమ చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. వారిని స్థానికులు అభినందించారు. కష్టకాలంలో తోడుగా నిలిచే వారే నిజమైన స్నేహితులని తెలిపారు. 

Similar News

News April 19, 2025

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: మంత్రి రాజనర్సింహ

image

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాయికోడ్ డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్‌గా కుమార్ రావు ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

News April 19, 2025

ఓ దశకు ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు: ట్రంప్

image

కాల్పుల విరమణపై ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు ఓ దశకు వచ్చాయని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. దీర్ఘకాలిక వివాదాన్ని ముగించేందుకు తాను ఏ ఒక్కరికీ అనుకూలంగా లేనట్లు చెప్పారు. ఈ చర్చలను పుతిన్, జెలెన్‌స్కీలలో ఎవరు కష్టతరం చేసినా వారిని మూర్ఖులుగా పరిగణిస్తామన్నారు. ఆపై శాంతి ఒప్పందలో మధ్యవర్తిత్వం నుంచి వైదొలుగుతామని తెలిపారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యమైతే US ముందడుగు వేస్తుందని వెల్లడించారు.

News April 19, 2025

వరంగల్ సీపీ హెచ్చరిక

image

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మైనర్లతో పాటు ఎలాంటి లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే వారిపై చర్యలు తప్పవని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. కమిషనరేట్‌ పరిధిలో మైనర్లను ప్రోత్సహించిన, వాహనాలు అందజేసినా యజమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

error: Content is protected !!