News April 24, 2024

పెమ్మసాని చంద్రశేఖర్ అఫిడవిట్‌లోని ఆస్తుల వివరాలు..

image

➤ పార్లమెంట్: గుంటూరు
➤ అభ్యర్థి: పెమ్మసాని చంద్రశేఖర్(TDP)
➤ విద్యార్హతలు: M.D, M.B.B.S
➤ భార్య: శ్రీరత్న కోనేరు
➤ చరాస్తి విలువ: రూ.2,316కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.2,289కోట్లు
➤ కేసులు: 1
➤ అప్పులు: రూ.519కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.2.06,400
➤ బంగారం: 181 గ్రాములు, భార్యకు 2,567.135 గ్రాములు బంగారం

Similar News

News March 9, 2026

గుంటూరు బస్టాండ్‌లో దొంగల బీభత్సం.. పని చేయని సీసీ కెమెరాలు

image

గుంటూరు ఎన్టీఆర్ ఆర్టీసీ బస్టాండ్‌లో గత కొన్ని నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిఘా లేకపోవడంతో నిత్యం 5 నుంచి 10 దొంగతనాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. వరుస చోరీలతో భయాందోళనకు గురవుతున్న బాధితులు.. తక్షణమే స్పందించి బస్టాండ్‌లో కొత్త కెమెరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీని వేడుకుంటున్నారు.

News March 8, 2026

టెన్నిస్‌లో సత్తా చాటిన గుంటూరు బిడ్డ లక్ష్మీ పోలూరి

image

గుంటూరులో జన్మించిన లక్ష్మీ పోలూరి టెన్నిస్‌లో అద్భుతాలు సృష్టించారు. మూడేళ్ల వయసులో ఆమె కుటుంబంతో సహా అమెరికా వెళ్లారు. 14 ఏళ్లకే దిగ్గజ క్రీడాకారిణి మోనికా సెలెస్‌ను ఓడించి ‘ఆరెంజ్ బౌల్’ టైటిల్ గెలిచారు. 15 ఏళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకుని సత్తా చాటారు. తర్వాత స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో విద్యాభ్యాసం చేసి, యూఎస్ కాలేజియేట్ నంబర్-1గా నిలిచారు.

News March 7, 2026

ఈనెల 13 లోగా అభ్యంతరాలు తెలపాలి: లింగేశ్వర్ రెడ్డి

image

జోన్-III పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని స్కూల్ అసిస్టెంట్ గేడ్-II ప్రధానోపాధ్యాయ పోస్టులకు, తాత్కాలిక సీనియారిటీ జాబితా విడుదల చేశారు. వివరాలను వెబ్ సైట్‌లో అందుబాటులో
ఉంచినట్లు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తెలిపారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత డీఈవో కార్యాలయంలో తగిన ఆధారాలతో ఈనెల 13వ తేదీలోగా అందజేయాలని సూచించారు.