News March 25, 2025
పెరవలి : చికెన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి

అన్నవరప్పాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి , పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హనుమంతు కూడా కన్నుమూశాడు. అయితే వారు ఇరువురూ చికెన్ కోసం అన్నవరప్పాడుకు వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
Similar News
News November 6, 2025
ఉండ్రాజవరం: ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో దువ్వాపు జయరాం (25) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను ప్రేమించిన యువతి తన ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
News November 6, 2025
ధాన్యం సేకరణ సందేహాలపై కంట్రోల్ రూమ్: కలెక్టర్

ఖరీఫ్ సీజన్‌లో వరి సేకరణ 4 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు రైతుల నుంచి మొత్తం15.64 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు సంయుక్త కలెక్టర్ వై. మేఘ స్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సందేహాలకు, ఫిర్యాదులకు కలెక్టర్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ నంబర్ 83094 87151కు సంప్రదించవచ్చన్నారు.
News November 6, 2025
రాజమండ్రి: ఈనెల 7 జాబ్ మేళా

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఈనెల 7 శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేళాలో బీఓబీ, ఎస్‌బీఐ పేమెంట్స్, భరత్ పే వంటి పలు సంస్థలలోని ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ పూర్తిచేసిన, 19 నుంచి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.


