News January 21, 2025

పెరిగిన చలి: హైదరాబాద్‌లో సింగిల్ డిజిట్

image

HYDలో చలి మరింత పెరిగింది. మంగళవారం HCU వద్ద అత్యల్పంగా 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మౌలాలి-9.3, BHEL-9.4, రాజేంద్రనగర్‌లో 9.7 సింగిల్ డిజిట్ నమోదు కావడం గమనార్హం. మరో 5 రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. KBR పార్క్, ఇందిరా పార్క్, ఓయూ తదితర ప్రాంతాల్లో ఉదయం చలిగాలులు వీచాయి. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త వహించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News December 10, 2025

ఓయూకు రూ.1000 కోట్లు

image

ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు కేటాయిస్తూ CM రేవంత్ రెడ్డి జీవో విడుదల చేశారు. ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఆయన విద్యార్థులకు ఈ నిధులను అంకితం చేశారు. క్యాంపస్‌లో మౌలిక వసతులు, మెరుగైన విద్య, నూతన భవనాల నిర్మాణాలు, విద్యార్థుల కోసం వీటిని ఉపయోగించనున్నారు. ఈ డబ్బు భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం వినియోగించాలని <<18476536>>CM<<>> పేర్కొన్నారు. పేద విద్యార్థులు ఎక్కడా ఇబ్బంది పడొద్దనేది తన సంకల్పం అన్నారు.

News December 10, 2025

మహానగరంలో ‘మహాలక్ష్మి’కి పెరుగుతున్న ఆదరణ

image

మహానగరంలో మహాలక్ష్మి పథకానికి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ బస్సు ప్రయాణం కల్పించిన అనంతరం బస్సులు రద్దీగా మారాయి. సరిగ్గా 2ఏళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు నగరంలో 118 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని.. ఈ మేరకు బస్సుల సంఖ్యను కూడా పెంచుతామని ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ తెలిపారు.

News December 10, 2025

తెలంగాణ విజన్ ఎగ్జిబిషన్‌కు ఫ్రీ ఎంట్రీ

image

​ప్రపంచ వేదికపై సక్సెస్ అయిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 ఎగ్జిబిషన్‌ను ప్రజలు సందర్శించేందుకు ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. DEC 10 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీ (కందుకూరు మండలం)కి అరేనా తెరిచి ఉంటుంది. ఉ.10 గం. నుంచి సా.7 గంటల వరకు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా సందర్శించవచ్చు. MGBS, కోఠి వివిధ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి.