News January 23, 2025

పెరిగిన చలి.. BHPL, ములుగు జిల్లా వాసుల ఇబ్బందులు

image

భూపాలపల్లి, ములుగు జిల్లాల వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మల్హర్ రావు మండలాల ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏటూరునాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి, ములుగు మండలాల్లోని ప్రధాన రహదారులను పొగ మంచు కప్పేయడంతో ఇబ్బందులు పడుతున్నారు.

Similar News

News September 15, 2025

ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, సిద్దిపేటలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇతర చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. నిన్న రాత్రి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే.

News September 15, 2025

సుప్రీంకోర్టులో కోర్టు మాస్టర్ ఉద్యోగాలు

image

<>సుప్రీంకోర్టులో<<>> 30 కోర్ట్ మాస్టర్ (షార్ట్ హ్యాండ్) గెజిటెడ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణులైన, స్టెనోగ్రాఫర్‌గా ఐదేళ్ల అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ఠ వయోపరిమితి 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, OBC, దివ్యాంగులకు రూ.750. రాతపరీక్ష, షార్ట్ హ్యాండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.sci.gov.in/

News September 15, 2025

మంచిర్యాలలో వందే భారత్ హాల్ట్ ప్రారంభం

image

మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనపు స్టాప్‌ను ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. ఈ రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్షా, సేవాగ్రామ్, చంద్రపూర్ స్టేషన్లను కలుపుతుంది. ఈ కొత్త హాల్ట్‌తో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, వ్యాపారం, వాణిజ్యం కూడా వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు.