News September 10, 2024
పెరిగిన తోటపల్లి నీటి మట్టం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 3,710 క్యూసెక్కులగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తివేసి 2,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాల్వల ద్వారా 190 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.5 టీఎంసీలకు కాగా.. ప్రస్తుతం 1.858 టీఎంసీలు ఉందన్నారు.
Similar News
News October 14, 2025
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయానికి 40 ఫిర్యాదులు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించారు. మొత్తం 40 ఫిర్యాదులు స్వీకరించగా, అందులో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 5, మోసాలు 4, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలు 22 ఉన్నాయని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫిర్యాదులపై 7 రోజుల్లో చర్యలు తీసుకుని నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
News October 13, 2025
VZM: ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న కౌన్సిలింగ్

ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలలో 91 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 16న ఉ.11 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ దేవి మాధవి సోమవారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు, 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ జాబితాలు http://vizianagaram.nic.in, అందుబాటులో ఉన్నాయన్నారు.
News October 13, 2025
విజయనగరం పోలీసు వెల్ఫేర్ స్కూల్లో టీచర్ ఉద్యోగాలు: SP

పోలీసు వెల్ఫేర్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఖాళీగా ఉన్న రెండు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ను బోధించేందుకు డీఈడీ/బీఈడీ అర్హత గల వారు కావాలన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈనెల 16న ఉ.10 గంటలకు విజయనగరం కంటోన్మెంట్ పోలీసు క్వార్టర్స్లో ఉన్న పోలీసు వెల్ఫేర్ పాఠశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు.