News September 10, 2024
పెరిగిన తోటపల్లి నీటి మట్టం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 3,710 క్యూసెక్కులగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తివేసి 2,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాల్వల ద్వారా 190 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.5 టీఎంసీలకు కాగా.. ప్రస్తుతం 1.858 టీఎంసీలు ఉందన్నారు.
Similar News
News October 13, 2024
VZM: మూడు స్లాట్లలో లాటరీ ప్రక్రియ
మూడు స్లాట్లలో మద్యం లాటరీ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8-10 గంటల వరకు మొదటి స్లాట్‌లో 50 షాపులు, ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 51 నుంచి 100 షాపుల వరకు(2వ స్లాట్), మధ్యాహ్నం 12 గంటల నుంచి 101 నుంచి 153 షాపుల వరకు(3వ స్లాట్)లో లాటరీ ప్రక్రియ జరగనుంది. లాటరీ ప్రక్రియ నిర్వహణ కోసం 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కౌంటర్‌లో ఒక తహశీల్దార్, ఎస్.హెచ్.ఓ ఉంటారు.
News October 13, 2024
పైడితల్లిమ్మ పండగ 2000 మందితో పటిష్ఠ బందోబస్తు
ఈ నెల 14,15,16, తేదీల్లో జరిగే పైడితల్లమ్మ పండగ తొలేళ్ళు, సిరిమానోత్సవానికి పటిష్ఠమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఆదివారం పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. సిరిమానోత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు 25 సెక్టర్లగా విభజించి 2000 మందితో రెండు షిఫ్టులో విధులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. వనం గుడి వద్ద 3 షిఫ్టులుగా విధులలో ఉంటారన్నారు.
News October 13, 2024
పైడితల్లి అమ్మవారి జాతరకు పటిష్ఠ ఏర్పాట్లు: విద్యుత్ శాఖ
జిల్లా కేంద్రం విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం, సిరిమాను ఉత్సవాల సందర్భంగా ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సిబ్బందికి బాధ్యతలు అప్పగించామని, విద్యుత్ సమస్యలకు 94408 12449, 55, 65, 66 నంబర్లకు గానీ, 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు గాని తెలియజేయాలని కోరారు.