News February 14, 2025
పెరిగిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గురువారం నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, యాదరుషి నిలయం, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.39,00,400 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News January 10, 2026
రికార్డు సృష్టించిన జెమీమా

WPLలో యంగెస్ట్ కెప్టెన్గా జెమీమా రోడ్రిగ్స్(25y 127days) రికార్డు సృష్టించారు. ఈ సీజన్లో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జెమీమా తర్వాతి స్థానంలో స్మృతి మంధాన(26y 230days-2023) ఉన్నారు. కాగా ఇవాళ ముంబైతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
News January 10, 2026
CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

CM చంద్రబాబు సంక్రాంతిని పురస్కరించుకొని 4 రోజులు పాటు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటించనున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సంబంధిత పనులను కలెక్టర్ వెంకటేశ్వర్లు, SP సుబ్బారాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు.
News January 10, 2026
పేదలకు ఉపాధి.. గ్రామాల్లో ఆస్తుల సృష్టి: CBN

AP: పేదలకు ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాల్లో ఆస్తులను సృష్టించేలా వికసిత్ భారత్ జీ రామ్ జీ పథకాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు సూచించారు. G RAM G గురించి ప్రజలకు, లబ్ధిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అన్నారు. BJP ఏపీ చీఫ్ మాధవ్, మంత్రి కందుల దుర్గేశ్తో ఆయన భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర సాధనకు ఈ పథకాన్ని వేదికగా చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా అమలు చేయాలని చెప్పారు.


