News July 11, 2024

పెరుగుతున్న పాలమూరు జిల్లా జనాభ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటా జనాభా పెరుగుతూనే ఉంది. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. 35,26,605 ఉన్న జనాభా 2024 సంవత్సరం వచ్చేసరికి.. 41,62,093కు చేరింది.. ఈ 12 సంవత్సరాలలో.. 6,35,488 జనాభా పెరిగింది. నెలకు సగటున 50 వేల జనాభా పెరుగుతూనే ఉంది. కుటుంబ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, ఆపరేషన్లకు ముందుకొచ్చిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ తెలిపారు.

Similar News

News December 9, 2025

దేవరకద్ర: సర్పంచ్ అభ్యర్థి.. 20 హమీలతో బాండ్

image

దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి బీజేపీ అభ్యర్థిగా రోజా రమేష్ సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. తనను గెలిపిస్తే 20 హామీలు నెరవేరుస్తానని బాండ్ పేపర్ రాశారు. వీటిలో ప్రధానంగా శివాజీ విగ్రహం ఏర్పాటు, రోడ్లు, వీధిదీపాలు, గ్రంథాలయం, ఆదాయ వ్యయాలను గ్రామసభలో చూపిస్తానన్నారు. 3 ఏళ్లల్లో 70% హామీలను నెరవేరుస్తామని అన్నారు.

News December 9, 2025

జడ్చర్ల: పంచాయతీ ఏర్పడిన ఐదేళ్లకు ఎన్నికలు

image

జడ్చర్ల మండలం బండమీదిపల్లి గ్రామం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడిన తర్వాత 2020 డిసెంబర్ 20 నుంచి ప్రత్యేక అధికారి పాలనలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుండడంతో గ్రామంలో మూడో విడత ఎన్నికల నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యలు తీరి గ్రామ సర్పంచ్ పాలనలో గ్రామ అభివృద్ధి చెందిందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

News December 9, 2025

MBNR: స్వామివారి తలనీలాలకు కోటి రూపాయల టెండర్

image

తెలంగాణ తిరుపతిగా పేరు ప్రఖ్యాతలుగాంచిన మన్నెంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం టెండర్లు నిర్వహించారు. పది సంవత్సరాల క్రితం పలికిన విధంగా ఈసారి కూడా కోటి రూపాయలు తలనీలాలకు రెండేళ్ల కాలపరిమితికి ఐదుగురు వ్యాపారులు పాల్గొన్నారు. శ్రీదేవి ఎంటర్ప్రైజెస్ వారికి దక్కిందని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు.