News July 11, 2024

పెరుగుతున్న పాలమూరు జిల్లా జనాభ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటా జనాభా పెరుగుతూనే ఉంది. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. 35,26,605 ఉన్న జనాభా 2024 సంవత్సరం వచ్చేసరికి.. 41,62,093కు చేరింది.. ఈ 12 సంవత్సరాలలో.. 6,35,488 జనాభా పెరిగింది. నెలకు సగటున 50 వేల జనాభా పెరుగుతూనే ఉంది. కుటుంబ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, ఆపరేషన్లకు ముందుకొచ్చిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ తెలిపారు.

Similar News

News February 13, 2025

MBNR: ‘స్థానిక ఎన్నికల్లో ఆర్వోలది పాత్ర కీలకం’

image

పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం అన్నారు. నిన్న జడ్పీ ఆఫీసులో ROలు, AROలకు శిక్షణ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఆర్వోలది క్రియాశీలక పాత్ర అన్నారు.ఎన్నికల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు. 

News February 13, 2025

బీర్ల ధరపై స్పందించిన శ్రీనివాస్ గౌడ్ 

image

బీరుకు 30 నుంచి 40 రూపాయలు ధర పెంచారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో నామమాత్రపు ధర పెంచితేనే గగ్గోలు పెట్టారని వాపోయారు. బీర్ల ధరలు పెంచడం దేనికి సంకేతమని, నాణ్యతలేని బీర్లు తీసుకొస్తున్నారని అన్నారు. బెల్టు షాపులు బంద్ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పుడూ సమాధానం చెప్పాలన్నారు.

News February 13, 2025

ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వండి: డీకే అరుణ

image

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లా అలంపూర్ లోని ఐదవ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్‌తో పాటు కురుమూర్తి, మన్నెంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.

error: Content is protected !!