News March 6, 2025
పెరుగుతున్న హనీట్రాప్ బాధితులు!

ఉమ్మడి నల్గొండ జిల్లాలో హనీట్రాప్ బాధితులు పెరుగుతున్నారు. పరువుపోతుందనే భయంతో వారు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బ్లాక్ మెయిలింగ్‌తో డబ్బు వసూళ్లకు అలవాటుపడిన సైబర్ నేరగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరించి నిలువుదోపిడీ చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే వీరేశానికి న్యూడ్ కాల్ చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 6, 2025
సిరిసిల్ల: ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వ్యక్తి మృతి

ఇల్లంతకుంట మండలంలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయిన ఘటన గురువారం చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం శీలం రజినీకాంత్(26) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పెద్ద లింగాపూర్ గ్రామ శివారులో బావిలో పడి మృతి చెందాడు. స్థానిక సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 6, 2025
రిటైర్మెంట్ నిర్ణయంపై సునీల్ ఛెత్రి యూ టర్న్

భారత ఫుట్‌బాల్ టీమ్ మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రి తన అంతర్జాతీయ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నెలలో జరిగే FIFA ఇంటర్నేషనల్ మ్యాచుల్లో జాతీయ జట్టుకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తారని ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ వెల్లడించింది. ఈ 40 ఏళ్ల ప్లేయర్.. గత ఏడాది జూన్‌లో రిటైర్మెంట్ ప్రకటించారు. IND తరఫున 151 మ్యాచుల్లో 94 గోల్స్ చేశారు.
News March 6, 2025
విజయమ్మ, షర్మిల షేర్ల బదిలీ రద్దు చేయాలని జగన్ పిటిషన్

తమ సంతకం లేకుండానే తన, భారతి షేర్లను తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, వాటిని రద్దు చేయాలని మాజీ CM జగన్ HYD జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(NCLT)లో పిటిషన్లు వేశారు. అందులో విజయమ్మ, షర్మిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. షేర్ల బదిలీపై స్టే కోరుతూ గతవారం జగన్ దాఖలు చేసిన మధ్యంతర, తాజా పిటిషన్లపై కౌంటర్ దాఖలుకు వాద, ప్రతివాదులు గడువు కోరారు. దీంతో APR 3కి విచారణ వాయిదా పడింది.