News August 22, 2024

పెళ్లిలో ఘర్షణ.. మద్యం మత్తులో కత్తితో దాడి

image

కమలాపురం పట్టణంలోని అప్పాయపల్లి CSI చర్చి వద్ద గురువారం జరిగిన వివాహ వేడుకలో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో మత్తులో ఉన్న కృష్ణయ్య ఏసన్న అనే వ్యక్తిని కత్తితో పొడిచాడు. వివాహ వేడుకకు హాజరైన వీరి మధ్య మాటా మాటా పెరిగి ఈ ఘర్షణ జరిగినట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కమలాపురం పోలీసులు గాయపడిన ఏసన్నను ఆసుపత్రికి చేర్పించి కేసు నమోదు చేశారు.

Similar News

News November 17, 2025

మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

image

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.

ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

image

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.