News January 26, 2025
పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

ఇష్టం లేని పెళ్లి చేస్తారేమోనని అనుమానంతో వట్టివల్ల రజిత(20) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన డోన్ మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మన్న తన కూతురుకు పెళ్లి చేయాలని ఇటీవల సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి ఇష్టం లేని రజిత శనివారం పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు డోన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 9, 2025
ఉంగుటూరులో ఈనెల 11న మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ నెల11న జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు.
News December 9, 2025
క్వార్టర్ మందు.. చికెన్ బిర్యానీ!

TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం మరికాసేపట్లో ముగియనుండటంతో గ్రామాల్లో ప్రలోభాల పర్వం జోరందుకుంది. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు గాలం వేస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 వరకు ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో చికెన్ బిర్యానీ, క్వార్టర్, కూల్డ్రింక్స్ పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఇంటికి కేజీ కోడికూర పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? COMMENT
News December 9, 2025
‘ఐదుగురు, అంతకంటే ఎక్కువమంది గుమికూడొద్దు’

కరీంనగర్ తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు CP గౌష్ ఆలం తెలిపారు. రూరల్ డివిజన్లోని ఐదు మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఈ ఉత్తర్వులు ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి DEC 11 రాత్రి 11:59 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూడటంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.


